ఆమెతో వాదించే అవకాశాన్ని కోల్పోతున్నా

Sushma Swaraj- fawad-hussain
Sushma Swaraj- fawad-hussain

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.తను నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడే గొప్ప వ్యక్తి ఆమె. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలిగగ అని ఫవాద్‌ ట్విటర్‌ వేదికగా నివాళులర్పించారు. ట్విటర్ వేదికగా ఆమెతో వాగ్వివాదానికి దిగే అవకాశం కోల్పోతున్నానని గత అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
కాగా గతంలో పాకిస్థాన్‌లో హిందూ అమ్మాయిలను అపహరించి మతమార్పిడి చేసిన అంశంలో సుష్మాస్వరాజ్‌, ఫవాద్‌ హుస్సేన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/