కివీస్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న రవీంద్ర జడేజా

విమర్శలెదురైన ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం

Ravindra Jadeja
Ravindra Jadeja, Indian cricketer

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలి, పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న కఠిన పరిస్థితుల్లోనూ రవీంద్రా జడేజా(77, 59 బంతుల్లో) టీమిండియాను ఆదుకున్నాడు. 92/6తో ఘోరపరాభవానికి చేరువైన జట్టును 200 పరుగులు దాటించి ఆశలు పెంచాడు. ధోనీ ఉన్నాడనే ధీమా అతని బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. కివీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఎదురొడ్డి నిలబడ్డాడు. భారత్‌ ఓడిపోయినా తన అద్భుత ప్రదర్శనతో హీరో అయ్యాడు జడేజా.
అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి పదేళ్లయినా వన్డేల్లో పూర్తిస్థాయి ఆటగాడిగా కొనసాగలేకపోయాడు. అప్పుడప్పుడూ మెరిసినా టెస్టు క్రికెటర్‌గానే పరిమితమయ్యాడు. విమర్శలెదురైనా ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. వన్డేల్లో ఇక రాలేడనుకున్న సమయంలో ప్రపంచకప్‌లో చోటుదక్కింది. శ్రీలంకతో మ్యాచ్‌లో అతడు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకపోయినా కీలక సెమీఫైనల్స్‌లో విజృంభించాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/