అన్యాయంగా 48 రోజులు జైల్లో ఉన్నాను

ఏ తప్పు చేయకుండానే ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు బనాయించింది

G. V. Harsha Kumar
G. V. Harsha Kumar

రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్‌ విడుదలయ్యారు. డిసెంబరు 13న అరెస్టయి ఇప్పటి వరకూ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. జైలు నుంచి విడుదలయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, అయినా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించడంతో అన్యాయంగా 48 రోజులపాటు జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. మూడు కేసుల్లో కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా అధికారులు తనను విడుదల చేయలేదన్నారు. జైలులో ఉండగా అనారోగ్యం చేస్తే రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారని, కానీ పూర్తిగా ఆరోగ్యం చక్కబడక ముందే మూడు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి మళ్లీ జైలుకు తరలించారని తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/