విచక్షణాధికారంతోనే బిల్లులను సెలక్టు కమిటీకి పంపాను

సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై నన్నేవరూ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేయలేదు

ma shareef
ma shareef

తణుకు: తన విచక్షణాధికారంతో బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలని తీర్మానించానని శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ చెప్పారు. అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై నిర్ణయం తీసుకునే ముందు తననెవరూ ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేయలేదని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకే పార్టీకి కొమ్ము కాస్తున్నారని వైఎస్సార్‌సిపి నేతలు ఆరోపిస్తున్నారన్న విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ బిల్లులను సెలక్టు కమిటీకి పంపాలన్న అభిప్రాయం చర్చల్లో వ్యక్తమైందని, ఆ ప్రక్రియ నిర్వహణలో ఆలస్యం వల్ల విచక్షణాధికారాన్ని వినియోగించి నిర్ణయం తీసుకున్నానని అన్నారు. మండలిలో వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు, మంత్రులు ఆవేశంలో తనను దూషించి ఉండొచ్చు కానీ వాటిని తాను పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో మూడు రాజధానులపై మీ అభిప్రాయం ఏంటన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయమై తానెలాంటి వ్యాఖ్యలు చేయబోనని షరీఫ్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/