ఇసుక “వార్‌” ఉత్సవాలన్నమాట

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఏపి సిఎం జగన్‌ను టిడిపి నేత నారా లోకేష్‌ తీవ్రంగా విమర్శించారు. ఇసుక వారోత్సవాలు అని గారు అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను. జగన్ గారు అన్నది ఇసుక ‘వార్’ ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్ లో భాగంగా ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నా
రని ఎద్దేవా చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ఒకపక్క వీధి రౌడీల్లా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు ఇసుకలో వాటాల కోసం తన్నుకుంటున్నారు, కానీ జగన్‌ గారి చేతకాని పాలనకు మరో భవన నిర్మాణ కార్మికుడు గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని లోకేష్‌ విమర్శించారు. ఇక ఇసుక వార్‌ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు పక్కన పెట్టి కార్మికులకు బతుకు భరోసా కల్పించండని నారా లోకేష్‌ ట్వీట్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana