వారంలో ఐదు రోజులు మాత్రమే దేశ ప్రధాని!

ఒక రోజు వైద్య వృత్తికి, ఒక రోజు కుటుంబానికి అంకితం

Lotay Tshering
Lotay Tshering, bhutan pm

తింపు: ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా భూటాన్‌ గుర్తింపు పొందింది. ఐతే ఆ దేశ ప్రధాని వారంలో ఐదు రోజులు మాత్రమే ప్రధాని బాధ్యతలు నిర్వర్తించి మిగిలిన రెండు రోజుల్లో ఒక రోజు సమాజ సేవకు మరొక రోజు కుటుంబం కోసం కేటాయిస్తున్న ప్రధాని కూడ ఉన్నారంటే ఆశ్య్చర్యం కలగకమానదు. భూటాన్‌ దేశ ప్రధానిగా 2018 నవంబరులో లోటే షేరింగ్‌ ఎన్నికయ్యారు. గతంలో భూటాన్‌లో రాజరికపాలన ఉండేది. ఆ తర్వాత భూటాన్‌ రాజరిక వ్యవస్థ నుండి బయటపడింది. లోటే షేరింగ్‌ కన్నా ముందు మరో ఇద్దరు ప్రధానమంత్రులు పనిచేశారు. ప్రపంచంలోని ప్రధానమంత్రులకు భిన్నంగా లోటే షేరింగ్‌ తన విధులను నిర్వర్తిస్తున్నాడు.
ప్రధాన మంత్రిగా ఎన్నికైన రోజు నుంచి ఆయన తన ప్రధాని బాధ్యతలను వారంలో ఐదు రోజులు మాత్రమే నిర్వహిస్తారు. మిగతా రెండు రోజులైన శనివారంలో ఆయన ఆసుపత్రిలో ఒక డాక్టర్‌గా సేవలు అందిస్తారు. ఇక ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆయన ఒక బెస్ట్‌ సర్జన్‌గా పేరుపొందారు. ఆయన డాక్టరు వృత్తిలో ఉండగానే 2013 రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పుడే మొదటిసారి ప్రధాని పదవికి పోటీ పడ్డారు. ఐతే 2018లో ప్రధాని పదవి వరించింది. దీంతో అప్పటి నుండి కూడ డాక్టర్‌ వృతితకి స్వస్తి చెప్పకుండా కొనసాగిస్తున్నారు.

Lotay Tshering
Lotay Tshering


ఒక సమాజ సేవ కాకుండా ప్రధాని కుటుంబ బాధ్యతలను కూడ అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. తన కుటుంబం కోసం వారంలో ఒక్కరోజును కేటాయిస్తున్నారు భూటాన్‌ ప్రధాని. ఆయన మాట్లాడుతూ..తనకు నచ్చిన వృత్తి డాక్టర్‌ వృత్తి, ఆసుపత్రికి వెళ్లి సేవ చేయడంలోనే తనకు సంతోషం ఉంటుందని అన్నారు. దేశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో తాను అత్యంత శ్రద్ధ కనబరుస్తానని వెల్లడించారు.
భూటాన్‌ దేశం చిన్నదేశమైనా ఆ దేశంలో 95 శాతం యువత ఉద్యోగాలు లేక క్రైం దిశగా అడుగులు వేస్తుండడంతో పాటు దేశంలో డయాబెటీస్‌తో పాటు ఒబేసిటి సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మరో వైపు భూటాన్‌ ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తుంది. ఇందుకోసం జంతు నిషేధాన్ని విధించడంతోపాటు అక్కడి మౌంటేన్లను కాపాడేందుకు కర్బన రహిత ప్రాంతంగా ప్రకటించారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/