కేసీఆర్ వల్లే విజయం సాధించా

Danam Nagender
Danam Nagender

హైదరాబాద్‌ : తెలంగాణలో ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచిన దానం నాగేంద్‌ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ వల్లే విజయం సాధించానని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ టీఆర్ఎస్‌ను గెలిపించాయని అన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేసి గెలిపించారంటే కేసీఆర్ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసమేనని ఆయన అన్నారు. ప్రజా కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రజలను ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు లొంగలేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌కు సీట్లు వచ్చాయంటే అది కేసీఆర్ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకమేనని దానం వ్యాఖ్యానించారు..