అమెరికా పర్యటనపై ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు

ప్రపంచ కప్‌ గెలిచినంత ఆనందంగా ఉంది

Imran Khan
Imran Khan

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అమెరికా పర్యటన ముగించుకుని ఈ రోజు ఇమ్రాన్‌ స్వదేశానికి చేరుకున్నారు. ఖతార్‌లోని దోహా విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన అనుచరులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఇమ్రాన్‌కు స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రయాణం, పర్యటన సాఫీగా సాగిందన్నారు. ప్రపంచ కప్‌ గెలుచుకొచ్చిన భావన కలుగుతోందన్నారు. ఇంతకుముందు పాకిస్థాన్‌ను లూఠీ చేసిన వారి భరతం పడతానని, అన్ని వ్యవస్థల్లోనూ పారదర్శకత తీసుకొస్తానని ప్రకటించారు. తమ దేశంలో ఇప్పటివరకు దొంగలు పడి దోచుకున్నారని, వాళ్లంతా ఇప్పుడు తగిన శిక్ష అనుభవిస్తున్నారని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
అయితే పాకిస్థాన్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఇమ్రాన్‌ ఖాన్‌ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఎన్నో అంచనాలతో అక్కడికి వెళ్లిన ఆయనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. అగ్రరాజ్యంలో అడుగిడగానే ఆయనను ఆహ్వానించడడానికి ఎవరూ రాలేదు. కొందరు పాకిస్థానీ అమెరికన్లు, పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీలే ఆయనకు స్వాగతం పలికారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/