కామెంటరీ చేయడం నాకు ఇష్టముండదు

ఐసిసి ఈవెంట్లలో ప్రయత్నిస్తా: యువీ

yuvaraj singh
yuvaraj singh

న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ తనకు కామెంటరి చేయడం అంటే తనకు నచ్చదని, అంతసేపు ఒకే దగ్గర కూర్చోని కామెంటరీ చెప్పాలంటే తన వల్లకాదని అన్నాడు. కాన ఐసిసి ఈ వెంట్లలో మాత్రం ట్రైచేస్తానని తన మనసులోని మాటని బయటపెట్టాడు. తాజాగా తన సహచర ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌ తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌ నిర్వహించాడు. కామెంటరీ చేసే ప్రాంతంలో కొంతమందిని నేను ఇష్టపడను. వారితో కలిసి రోజంతా కూర్చుని కామెంటరి చెప్పడం నా వల్ల కాదు. అయితే ఐసిసి ఈవెంట్లలో మాత్రం కామెంటరీ చెప్పెందుకు నేను ప్రయత్నిస్తానని యువరాజ్‌ అన్నాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/