టిడిపి అభిమాని అవినాష్‌ అరెస్టును ఖండిస్తున్నాను

టిడిపి సోషల్‌ మీడియా వాలంటీర్లకు అండగా ఉంటాను

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: టిడిపి అభిమాని అవినాష్‌ అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. అవినాష్‌ తో సహా టిడిపి సోషల్‌ మీడియాలో పనిచేస్తున్న వాలంటీర్లకు అండగా ఉంటానని నారా లోకేష్‌ భరోసా ఇచ్చారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తూ భావ ప్రకటనా స్వేచ్ఛని అణిచివేస్తూ పోలీసులు వ్యవహరించడం మానవ హక్కులు హరించడమేనని ఆయన దుయ్యబట్టారు. ఇంకా తప్పుడు కేసులతో వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు తొత్తులుగా మారుతున్న పోలీసులు చేసిన ప్రతి తప్పుకి న్యాయస్థానాల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని నారా లోకేష్‌ హెచ్చరించారు. వైఎస్సాఆర్‌సిపి ప్రజాప్రతినిధులకు బూతులు మాట్లాడే హక్కు కల్పిస్తూ ప్రత్యేక చట్టం ఏమైనా తీసుకొచ్చారా ముఖ్యమంత్రి జగన్‌ గారిని నారా లోకేష్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/