కెసిఆర్ ఆశీస్సులతోనే మంత్రి అయ్యాను
రాష్ట్ర ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతిరాథోడు మహశివరాత్రి సందర్భంగా కురవి శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మఖ్యమంత్రి కెసిఆర్, కురవి వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతోనే తాను మంత్రినయ్యాయనని సత్యవతి రాథోడు తెలిపారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు నేడు సాగునీరు, తాగునీరు వస్తున్నాయి. ఈ రోజు డోర్నకల్ రైతులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి నిధులు ఇచ్చిన తర్వాత మూడు జాతరలు బాగా జరిగాయని అన్నారు. అయితే పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. త్వరలో పనుల తీరును సమీక్షించి, ఇంకా అవసరమైతే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అడిగి మరిన్ని నిధులు తెచ్చి ఈ దేవస్థాన అభివృద్ధికి కృషి చేస్తానని సత్యవతి రాథోడు తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/