తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం

chandra babu naidu, ap cm
chandra babu naidu, ap cm

అమరావతి: తెలుగు గడ్డపై జన్మించి ఇక్కడి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని సియం చంద్రబాబు పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని ట్విట్టర్‌లో పేర్కోన్నారు.
ధర్మ పోరాట దీక్ష ఆరంభించి నేటికి సంవత్సరం అయిందని, 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డానని చెప్పారు. అప్పుడప్పుడూ కొంత ఆలస్యం ఐనా అంతిమంగా ధర్మానిదే విజయం అని అనుభవంలో నేర్చుకున్నానని పేర్కొన్నారు. రాష్ట్రానికి ,ప్రజలకు కూడా న్యాయం జరిగి మళ్లీ ధర్మం గెలుస్తుందని నమ్మకం తనకుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/