జగన్‌ అన్న ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నా

mla roja
mla roja

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటుకు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహిళలకు రక్షణగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి దిశా యాక్ట్‌, దిశా యాప్‌, దిశా పోలీస్‌ స్టేషన్లు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో జగనన్న, నా తోటి మహిళా నాయకులతో కలిసి వున్న ఫోటోలను ఆమె ట్విట్టర్‌ పోస్టు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/