తాటాకు చప్పుళ్లకు భయపడను
పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా : రోజా

నగరి: లాక్డౌన్ వేళ నగరి నియోజక వర్గంలో ని సుందరయ్యనగర్లో ఎమ్మెల్యే రోజా బోరుబావి ప్రారంబోత్సవం చేశారు. అయితే అక్కడ జనాలు గుమిగూడడం, ఆ సమయంలో పూలతో స్వాగతం పలకడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు వెల్లువెత్తాయి. దీనిపై నగరి ఎమ్మెల్యే స్పందించారు. సుందరయ్యనగర్లో ప్రజలు నీళ్లు కరెంట్ లేక ఇబ్బందులుపడుతుంటే, గత ప్రభుత్వ ఏమి చేయలేదని , వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పెద్ద మనసుతో వారికి నీళ్లు, ఇస్తే… ఆ ప్రాంత ప్రజల ఆహ్వనం మేరకే నేను అక్కడికి వెళ్లానని, కాని వారు పూలు జల్లుతారని ఊహించలేదని తెలిపింది. దీనిని టిడిపి నేతలు పెద్ద రాద్దాంతం చేస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. సోషల్ మీడియా ఉంది కదా అని పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తే తాట తీస్తా అని రోజా హెచ్చరించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/