గోరంట్ల మాధవ్ వీడియో ప్రైవేట్ అంశం కాదుః కేశినేని నాని

టీడీపీలో తాను తృప్తిగానే ఉన్నానన్న నాని

Kesineni Nani
Kesineni Nani

అమరావతిః విజయవాడలోని కేశినేని భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను నాని ఎగురవేశారు. అనంతరం టీడీపీలో కేశినేని అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కేశినేని నాని మాట్లాడుతూ… తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని అన్నారు. తాను ఎంపీగా ఉన్నా… లేకపోయినా విజయవాడకు వచ్చిన నష్టం ఏమీ లేదని…. తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారని చెప్పారు. తన ఎంపీ స్టిక్కర్ కేవలం తన కారుపై మాత్రమే ఉంటుందని… ఆ కారులో తన కూతురును కూడా తిరగనివ్వనని కేశినేని నాని తెలిపారు.

ఇక వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని… అది మహిళలకు సంబంధించిన విషయమని చెప్పారు. రాజకీయ నాయకులు చాలా క్లీన్ గా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు మన దేశ పరిస్థితి చాలా దారుణంగా వుండేదని… ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/