నేను ధోనీ అభిమానినే: సల్మాన్ ఖాన్

నేను ధోనీ అభిమానినే:  సల్మాన్ ఖాన్
Salman khan , Dhoni

ముంబయి: టీమిండియాకు ఎన్నో ఘనవిజయాలు అందించినమాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ధోనికి ఉనన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ధోనీ అరంగేట్రంనుంచి ఇప్పటివరకూ తన బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌లతో అభిమా నులను అలరించాడు. కెప్టెన్‌గా రెండుప్రపంచ కప్‌లుసాధించాడు. 2007, 2011ల్లో టీమిండియాకుప్రపంచకప్‌లు తెచ్చాడు. ఎంఎస్‌ధోనీకి మన దేశం లోనే కాకుండాప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. ఇక మనదేశంలోని సెలబ్రిటీల్లోఎక్కువమంది దోనీ అభిమానులే అనడంలో ఎలాంటి సందేహంలేదౖు. ధోనీ తన ఫేవరేట్‌క్రికెటర్‌ అని బాలివుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. సల్మాన్‌ తాజా చిత్రం దబాంగ్‌-3 ఈ సినిమా ఈనెల 20వ తేదీ విడుదలవుతోంది. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్‌బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్‌ నిర్వహించేక్రికెట్‌లైవ ్‌కార్యక్రమంలో సల్మాన్‌పాల్గొన్నాడు. టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేదార్‌జాదవ్‌తో తనకున్న అనుబంధం తెలిపాడు. ఇక ధోనీ తన అభిమానక్రికెటర్‌ అని చెప్పాడు. దోనీ దబాంగ్‌ప్లేయర్‌ అని సల్మాన్‌ జోక్‌చేసాడు. దోనీ ప్రస్తుతంఇకెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దబాంగ్‌-3 విలన్‌ఇచ్చ సుదీప్‌కూడా ఆరోజు ఎవరు బాగా ఆడితే వాళ్లే తన అభిమాన క్రికెటర్‌ అని సుదీప్‌ వెల్లడించాడు. నాకు అభిమానక్రికెటర్‌ అంటూ ఎవరూ లేరని, ఆరోజు ఎవరూ బాగా ఆడితే వాళ్లనే ఇష్టపడతానని పేర్కొనాడు. అంతేకా కుండా ఒక అభిమానిగా ప్రతి ఒక్క ఆటగాడిని గౌరవించాలని తానుభావి స్తానని, అయితేనేను ఎప్పటికీ ఇష్టపడేది అనిల్‌ కుంబ్లేని, రోహిత్‌శర్మ అంటే కూడా ఇష్టమేనని సుదీప్‌ వెల్లడించాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/