మార్కెట్లోకి ఆరా కాంపాక్ట్‌ సెడాన్‌

హ్యుందాయ్ మోటార్స్‌ తన సరికొత్త ఆరా కాంపాక్ట్‌ సెడాన్‌ కారును ఆవిష్కరించింది

Hyundai Aura compact sedan revealed
Hyundai Aura compact sedan revealed

న్యూఢిల్లీ:దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ తన సరికొత్త ఆరా కాంపాక్ట్ సెడాన్ కారును దేశీయంగా ఆవిష్కరించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన సెడాన్‌ కారును మంగళవారం ఆవిష్కరించింది. దీన్ని హ్యుందాయ్‌ ఐ 10నియోస్‌ మోడల్‌ను పోలిన స్టయిల్‌తో సరికొత్తగా డిజైన్‌ చేసింది. ఇప్పటికే (జనవరి 2, 2020) హ్యుందాయ్ ఆరా బుకింగ్ ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. హ్యుందాయ్ అధీకృత డీలర్లవద్ద రూ. 10వేలు చెల్లించి ఆరా కారును బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల బుకింగ్‌పై 10 శాతం డిస్కౌంట్‌ను అదనగంగా అందిస్తోంది. ఫైరీ రెడ్, పోలార్ వైట్, టైఫూన్ సిల్లార్, టైటాన్ గ్రే, ఆల్ఫా బ్లూ వింటేజ్ బ్రౌన్ 6 కలర్ ఆప్షన్లలో లభ్యం. దీంతోపాటు వండర్‌ వారంటీని కూడా హ్యుందాయ్‌ అందిస్తోంది. హ్యుందాయ్ ఆరా డ్యూయల్టోన్ కలర్ స్కీమ్‌ , డ్యాష్‌బోర్డు మీద డార్క్ షేడ్స్, ఫ్యాబ్రిక్ అప్‌హోల్‌స్ట్రే, సీట్లు బీజీ కలర్ ఫినిషింగ్‌లో వచ్చాయి. డ్యాష్‌బోర్డు మీదున్న సెంటర్ కన్సోల్‌లో ఆపిల్ కార్‌‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 8.0ఇంచుల టచ్‌‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమర్చింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/