రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

Road accident in hyderabad
Road accident in hyderabad

హైదరాబాద్‌: అతివేగం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. ఈ ప్రమాదంలో ఓ ఉద్యోగిని అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అమీర్‌పేట్‌- యూసఫ్‌గూడ రోడ్డు ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఈ రోజు కూడా ఎప్పటిలాగే రద్దీగా ఉన్న రోడ్డులో ఓ యువతి తన స్కూటీపై రోడ్డుపై వెళ్తుంది. ఆమె ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. అయితే పని హడావుడిలో పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడ వైపుగా వెళ్తుంది. అక్కడి ఆంధ్రాబ్యాంక్ దగ్గర జరిగిందీ రోడ్డు ప్రమాదం. సాయి దీపిక నడుపుతున్న టూవీలర్… ఆంధ్రబ్యాంక్ దగ్గర అదుపు తప్పింది. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. బస్సు వెనక చక్రాల్లోకి స్కూటీ వెళ్లిపోవడంతో… ఆమె తప్పించుకోలేకపోయింది. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కలత చెందారు. ఇలా జరగకపోయి ఉంటే బాగుండేదే అని అంతా బాధపడ్డారు. సాయి దీపిక.. జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. త్వరగా వెళ్లాలనే కంగారులో… వేగంగా బండి నడుపుతూ… అదుపు తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఓ ఉద్యోగిని ఇలా ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/