అమెరికాలో రోడ్డు ప్రమాదం..తెలుగు యువతికి బ్రెయిన్‌డెడ్

హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ యువతి బ్రెయిన్ డెడ్ అయ్యింది. అక్కడి మిచిగాన్‌లోని లాన్సింగ్లో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న చరితా రెడ్డి(26) కారు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యింది. తన కారులో వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, నిందితుడు మద్యం సేవించి కారు నడపడం వల్లే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను హైదరాబాద్‌కు తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/