తల్లి కళ్లముందే కొడుకు, కాబోయే కోడలు మృతి

రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం

Train accident
Train accident

హైదరాబాద్‌: కన్న తల్లి కళ్ల ముందే పెళ్లి కావాల్సిన యువజంట రైలు ప్రమాదంలో మరణించారు. తన కొడకు, కాబోయే కోడల్ని పోగొట్టుకున్న ఆ తల్లి రోదించిన తీరు వర్ణనాతీతం. హైదరాబాద్‌లోని చందానగర్‌ రైల్వే స్టేషన్‌లో ఈ హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన సూర్యకళ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. సూర్యకళ భర్త చనిపోయి కొంతకాలం అయింది, ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కొడుకు దివ్యాంగుడు, రెండో కొడుకు ఆట నడుపుతూ తల్లికి అండగా ఉంటున్నాడు. కాగా తన చిన్న కొడుకుకు తన మేనకోడలుతో వివాహం కూడా నిశ్చయం అయింది. ఈ క్రమంలో సూర్యకళ తనకు కాబోయే కోడలిని తీసుకుని గుంటూరు వెళ్లాలనుకుంది. రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు వస్తుండగా అదుపు తప్పి పట్టాల మధ్యలో పడిపోయింది. అప్పటికే పట్టాలు దాటిన కొడుకు కోడలు తనని లేపేందుకు వెనక్కి వచ్చే క్రమంలో ఎంఎంటిఎస్‌ రైలు వారిని ఢీకొట్టింది. అక్కడిక్కడే మృతి చెందిన కొడుకు, కాబోయే కోడలి చూసి సూర్యకళ షాక్‌కు గురైంది. ఆమె రోదనలకు అక్కడున్నవారందరూ కంటతడి పెట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/