స్టార్టప్‌ తెలంగాణ: మార్కెట్లోకి ఈ ట్రాక్టర్‌

Hyderabad startup E-tractor
Hyderabad startup E-tractor

హైదరాబాద్‌: నగరానికి చెందిన స్టార్టప్ సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ బుధవారం సరికొత్త ఈ-ట్రాక్టర్‌ను లాంచ్ చేసింది. దీని ఖరీదు కూడా అందుబాటులో ఉందని కంపెనీ చెబుతోంది. దీని పనితీరు కూడా డీజిల్ పవర్డ్ ట్రాక్టర్ కంటే నాలుగు రెట్లు ఉంటుందట. తాము తీసుకు వచ్చిన ఈ-ట్రాక్టర్ పర్యావరణహితమైనదని సెల్లెస్టియల్ ఈ మొబిలిటీ కో-ఫౌండర్ సిద్ధార్థ దురైరాజన్ వెల్లడించారు. తాజా ఆవిష్కరణతో దేశంలోకి విద్యుత్‌తో నడిచే ట్రాక్టర్లు వచ్చాయి. ఈ ట్రాక్టర్ 6 HP(21HP డీజిల్ ట్రాక్టర్‌కు సమానం) శక్తిని ఇస్తుందని, సింగిల్ చార్జింగ్‌తో 75 కి.మీ. దూరం ప్రయాణించవచ్చునని, ఈ ట్రాక్టర్‌ గంటకు 20 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందని సిద్దార్థ దురైరాజన్ తెలిపారు. ఈ ట్రాక్టర్‌ వినియోగించిన వారికి సరాసరిగా గంటకు రూ.20 నుంచి 35 మేర ఖర్చు కానుందన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే నాలుగైదు గంటలు పని చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 150 ఏహెచ్. పుల్లింగ్ సామర్థ్యం 1.2 టన్నులు. నెలకు 100 ట్రాక్టర్ల తయారీ సామర్థ్యం ఉన్న ప్లాంట్ ఉందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో 8,000 ట్రాక్టర్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/