హైదరాబాద్‌ లలితా జ్యూవెల్లరీలో చోరీ

Lalitha jewellers hyderabad
Lalitha jewellers hyderabad

హైదరాబాద్‌: నగరంలోని పంజాగుట్టలోని లలితా జ్యూవెల్లరీలో చోరీ జరిగింది. సిబ్బంది దృష్టిని మరల్చిన దొంగలు ఆభరణాలను దోచుకెళ్లారు. అయితే ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 15న సాయంత్రం కొందరు వ్యక్తులు గుంపుగా షాపులోకి వచ్చారు. వినియోగదారుల్లా నటిస్తూ ఆభరణాలను చూశారు. ఈ క్రమంలో అక్కడి సిబ్బంది దృష్టి మరల్చి రెండు బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్‌ను చోరీ చేశారు. వీటి విలువ రూ.3.5 లక్షలు ఉంటుందని అంచనా. ఆభరణాలు చోరీ అయిన విషయం ఆడిట్‌లో బయటపడింది. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించగా గుంపుగా వచ్చిన వారిలోనే ఎవరో ఆభరణాలను మాయం చేసినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/