ఆస్ట్రేలియాలో దారుణ హత్య

Preethi Reddy
Preethi Reddy

మెల్‌బోర్న్‌: భారత సంతతి దంత వైద్యురాలు, తెలంగాణకు చెందిన ప్రీతిరెడ్డి(32) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలోదారుణ హత్యకు గురయ్యారు సిడ్నీలో పార్క్‌ చేసిన ఆమె కారులోనే మృతదేహాన్ని కనుగొన్నారు. శరీరంపై చాలాచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. ఆమె మృతదేహాన్ని ఓ సూట్‌కేసులో కుక్కి కారులో పడేశారు. ప్రీతిరెడ్డిని ఆమె మాజీ ప్రియుడు, భారత సంతతికి చెందిన మరో దంత వైద్యుడు హర్ష్‌ నర్డే హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతను కూడా ఆమె అదృశ్యమైన తర్వాతిరోజే తన కారు ఓ ట్రక్‌ను ఢీకొన్న ఘటనలో మృతి చెందాడు. ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలోని న్యూ ఇంగ్లాండ్‌ హైవేపై సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. అతను కావాలనే ట్రక్‌ను ఢీకొట్టినట్లు న్యూ సౌత్‌ వేల్స్‌ పోలీసులు భావిస్తున్నారు. ప్రీతిరెడ్డి అదృశ్యమైన తర్వాత దర్యాప్తులోభాగంగా అతనితో తాము మాట్లాడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.