రేపు అర్ధరాత్రి ఒంటిగంటవరకు మెట్రో సర్వీసులు

మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దు

hyderabad metro
hyderabad metro

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మెట్రో ప్రత్యేక సర్వీసులు అన్ని స్టేషన్ల నుంచి అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆరోజు రాత్రి మద్యం సేవించిన వారికి మెట్రో రైలు ఎక్కేందుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. అయితే, మద్యం సేవించిన వారు తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని సూచించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/