మెట్రోని పొగుడుతూనే మండిపడ్డ అసదుద్దీన్‌

హైదరాబాద్‌ మెట్రో సంస్థపై ఓవైసి ఆగ్రహం

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఈ నెల 7 వ తేదీన సాయంత్రం 4 గంటలకు జేబిఎస్‌-ఎంజిబిఎస్‌ మధ్య మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయంపై హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. అయితే ఈ ట్వీట్‌పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అద్భుతం అంటూ పొగుడుతూనే.. జేబిఎస్‌-ఎంజిబిఎస్‌ మెట్రో పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. మరి హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఎంజిబిఎస్‌-ఫలక్‌నూమా మధ్య పనులు ఎప్పుడు మొదలు పెడుతుంది? జేబిఎస్‌-ఎంజిబిఎస్‌ మార్గానికి మీ వద్ద నిధులు ఉంటాయి, కానీ ఫలక్‌నూమా కు విస్తరించేందుకు ఉండవా? అంటూ ఆయన ప్రశ్నించారు. కాగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఈ నెల 7 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో కారిడార్1..29.. కిలోమీటర్లు, కారిడార్3.. 29 కిలోమీటర్లతో కలిపి హైదరాబాద్‌లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రోసేవలు అందుతాయని తెలిపింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/