హైదరాబాద్ శివారులో దారుణం : ప్రేమను నిరాకరించిందని యువతీ గొంతుకోసిన ప్రేమోన్మాది

హైదరాబాద్ శివారులో దారుణం : ప్రేమను నిరాకరించిందని యువతీ గొంతుకోసిన ప్రేమోన్మాది

ప్రేమిస్తున్నాని వెంటపడడం..వారి ప్రేమను నిరాకరిస్తే కత్తులతో దాడులు చేయడం కామన్ అయిపొయింది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగగా..తాజాగా గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వట్టి నాగులపల్లిలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగపడ్డాడు. తన ప్రేమను నిరాకరించిందని యువతీ ఇంటికి వెళ్లి ఆమె ఫై కత్తితో దాడి చేసాడు. ప్రస్తుతం ఆ యువతీ గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతుంది.

ప్రేమ్ సింగ్ అంటే యువకుడు వట్టి నాగులపల్లి కి చెందిన యువతీ ని ప్రేమిస్తున్నానని గత కొద్దీ రోజులుగా ఆమె వెంటపడుతున్నాడు. అతడి ప్రేమను నిరాకరించడం తో కోపం పెంచుకున్న ప్రేమ్ సింగ్..ఫుల్ గా మద్యం సేవించి , యువతీ ఇంటికి వచ్చి ఆమెపై కత్తి తో దాడి చేసాడు. యువతి గొంతు, చేతులు, కాలు మని కట్టు కోసి బంధించాడు. అయితే యువతి గట్టిగా కేకలు వేయడంతో బంధువులు, స్థానికులు వచ్చి యువకుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం యువతీ గాంధీ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటుంది.