అదనంగా హైదరాబాద్‌ మెట్రో సేవలు

Metro Rail
Metro Rail

హైదరాబాద్: నగరంలోని ప్రయాణికులకు మెట్రో అదనంగా సేవలందించనుంది.ఆర్టీసి సమ్మె తరువాత నగరంలో ఆర్టీసి నష్టాలను తగ్గించడానికి నష్టాలు వచ్చే రూట్లలో దాదాపు వెయ్యి బస్సులను రద్దు చేసినట్లు తెలిపింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మెట్రో టైమింగ్స్ ను పొడిగించినట్లు హైదరాబాద్‌ మెట్రో ప్రకటించింది. రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చివరి సర్వీస్‌ను రాత్రి 11 గంటలకు బయలుదేరి గం.11.50ని.లకు ఆఖరి స్టాప్ వద్ద ఆగనుందని మైట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఉదయం సర్వీసులు ఇదివరకు 6గంటల నుంచి ప్రారంభం కానుండగా.. ఇప్పుడు గం.6.30ని.లకు మొదలుకానుందని ఆయన వెల్లడించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/