ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మెట్రో ట్రైన్లు

రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో..

Metro Train Services
Metro Train Services

Hyderabad: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేయడంతో మెట్రో రైళ్లు పూర్తి స్థాయిలో పట్టాలెక్కనున్నాయి. ఇదేసమయంలో సర్వీసుల వేళల్లో కొంచం మార్పులు చేశారు. రేపటి నుంచి నుంచి మెట్రో సేవలు అందుబాటులో రానున్నాయి. ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి ట్రైన్‌, చివరి స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు రైలు బయలుదేరుతుంది. మారిన సమయాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని. అయితే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు వెల్లడించారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/