హుజూర్‌ నగర్‌లో మోరాయించిన ఈవీఎంలు

ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన మరో ఈవీఎం కూడా మొరాయింపు

evm
evm

హైదరాబాద్‌: హుజూర్ నగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నియోజకర్గంలోని మేళ్లచెరువులోని 133 కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దీంతో, వెంటనే మరో ఈవీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. ఇది కూడా పని చేయకుండా మొరాయించడంతో ఆ బూత్ లో పోలింగ్ ను అధికారులు నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వీరి కోసం 302 పోలింగ్ కేంద్రాల్లో 1708 ఈవీఎంలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో మొత్తం 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెబ్ క్యాస్టింగ్ ను ఏర్పాటు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/