కేసీఆర్ నీ భరతం పడతాం – ఈటెల వార్నింగ్

హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో తెరాస ఫై విజయం సాధించిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని..రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ఫై ఈటెల మండిపడ్డారు. గత కొద్దీ రోజులుగా ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి – తెరాస మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం చిన్న చూపు చూస్తుందని తెరాస వర్గాలు అంటుంటే..40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రం కొంటామని హామీ ఇచ్చిందని..అయినాగానీ ప్రభుత్వం రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని బిజెపి విమర్శిస్తోంది.

ఈ తరుణంలో ఈటెల రాజేందర్..కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు.సివిల్ సప్లై కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేక పోవడం తో దాన్యం కొనడం లేదని అనుమానం వస్తుందన్నారు. నా రైతులు.. నా రాష్ట్రం అన్న కేసీఆర్ మన రైతుల కోసం ధ్యానం ఎందుకు కొనుగోలు చేయవని ప్రశ్నించారు. బాధ్యత గల ప్రతి పక్ష పార్టీ గా బిజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళితే రాళ్ల తో దాడి చేయడం హేయమైన చర్య అని నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం బెంగాల్ కాదు ఇక్కడ మంచికి మాత్రమే తెలంగాణ ప్రజలు పట్టం కడతారని.. నీ భరతం పడతామని వార్నింగ్ ఇచ్చారు.