ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం: ఈటల
హుజూరాబాద్ నియోజక వర్గంలో పర్యటన-ప్రజలు ఘన స్వాగతం

Huzurabad: రాష్ట్రంలో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరగబోతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా తర్వాత హుజూరాబాద్ నియోజక వర్గంలో తొలిసారిగా పర్యటిస్తున్నారు. శంభునిపల్లి నుంచి కమలాపూర్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ , హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. తాను హక్కుల కోసం, నిరుద్యోగులకు కోసం పోరాటం చేస్తానని, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఈ ఎన్నిక జరగబోతోందన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/