అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల జోరు నడుస్తుంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో నిలువగా.. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు. కానీ కొండా సురేఖ వైపు మొగ్గుచూపుుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం బిజెపి , తెరాస పార్టీల నేతలు నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. ఈ తరుణంలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

హుజురాబాద్ లో పరిస్థితిపై ఎన్నికల సంఘం బుధవారం ఆరా తీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించింది. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, వైద్యారోగ్య శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హుజురాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉందని … కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీకాల పంపిణీ కొనసాగుతోందా అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై నోటిఫికేషన్ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది.