బ్రేకింగ్ న్యూస్ : హుజురాబాద్ ఉప ఎన్నికలు వాయిదా

కరోనా మూడో దశ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక తో పాటు బద్వేల్ ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హుజరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక, బద్వేల్ తో పాటు పశ్చిమ బెంగాల్లో మూడు స్థానాలు ఒరిస్సాలో ఒక స్థానం మినహా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. దీనితో హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో కాస్త ఉత్కంఠ తగ్గింది. కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడ్డాక ఉప ఎన్నికల పై మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అన్ని పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్న సంగతి తెలిసిందే.

కాగా.. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో.. వైసీపీ ఎమ్మెల్యే హఠాత్తుగా మరణించడంతో బద్వేల్‌లో ఉప ఎన్నిక వచ్చింది. ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌తో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అనంతర పరిణామాలు, సీఎం కేసీఆర్‌ ప్రకటించిన దళిత బంధు సహా ఇతర ప్రభుత్వ పథకాల ప్రకటనల ఎత్తుగడలు, ప్రతిగా విపక్షాల విమర్శలతో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నిన్నటి వరకు అక్టోబర్ లో ఉప ఎన్నికలు జరగబోతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వాయిదా పడడం ఇరు పార్టీలకు పెద్ద షాక్ గా మారింది.