భార్య కొడుతుందని ఫిర్యాదు చేసిన భర్త

Complaint against wife
Complaint against wife

వికారాబాద్‌: జిల్లాలోని బషీరాబాద్‌లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఎక్కడైనా భర్త కొడుతున్నాడంటూ పోలీసులను భార్య ఆశ్రయించడం గురించి చాలా సార్లు విన్నాం. అయితే భార్య కొడుతోందని ఓ అమాయక భర్త పోలీసులను ఆశ్రయించాడు. భార్య చేతిలో ఇక తన్నులు తినలేనంటూ, తనను రక్షించాలంటూ పోలీసులను వేడుకున్నాడు. ఆయన చేసిన ఫిర్యాదు పట్ల పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీలో ఈ ఘటన చోటు చేసుకుంది. షాదుల్లా అనే వ్యక్తి బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఎస్సైకి తన బాధ చెప్పుకున్నాడు. ఇంట్లో భార్య చేతిలో ఆయన అనుభవిస్తోన్న కష్టాలను తెలుసుకున్న ఎస్సై.. ఆమెతో మాట్లాడి కాపురాన్ని చక్కదిద్దుతామని షాదుల్లాకు నచ్చజెప్పారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/