అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

వైద్యశాలకు బాధితురాలి తరలింపు

Wounded woman

Chilakaluripet: చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలో భార్య గొంతు కోసిన భర్త సంఘటన కలకలం రేగింది. సేకరించిన వివరాల ప్రకారం ఒడిస్సా కు చెందిన ఫోపూన్ గనున్ (37) రీటా (28) ఇద్దరూ భార్య భర్తలు. వీరు స్థానికంగా ఉన్న స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పనిచేస్తున్నారు. భార్యపై అనుమానంతో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె భర్త రీటా గొంతు కోశాడు.
. స్థానికులు అతనిని స్తంభానికి కట్టివేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. యడ్లపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరపగా తన భార్య తన పై బ్లేడుతో దాడి చేయభోగా తాను దాడి చేసి ఆమె గొంతు కోసినట్లు తెలిపాడు. గాయపడిన రీటాను పోలీసులు చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి నిలకడగా ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు యడ్లపాడు ఎస్ ఐ పి.రాంబాబు తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/