పోలీసులమంటూ హల్‌చల్‌: ఇద్దరు అరెస్ట్‌

Fake police
Fake police

గుంటూరు: తాడేపల్లిలో పోలీసులు తరచూ మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ గుంటూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు షాపు యజమానులు. తేలికగా డబ్బు సంపాదించేందుకు ఇద్దరు నకిలీగాళ్లు పోలీసులు రూపంలో షాపుల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అందరూ భయపడి ఎంతోకొంత సమర్పించడంతో ఇదే అదునుగా ఆ నకిలీలు రెచ్చిపోయారు. ఇక రోజురోజుకీ వీళ్ల దురాక్రమణ మితి మీరడంతో విసుగు చెందిన దుకాణ యజమానులు అధికారులకు సమాచారం అందించగా, రంగంలోకి దిగిన పోలీసులు నకిలీగాళ్ల చర్యలకు ఖంగుతిన్నారు. తేలికగా డబ్బు సంపాదించాలే నెపంతో ఇద్దరు యువకులు పోలీసుల అవతారం ఎత్తారని తెలిపారు. తాడేపల్లిలో షాపులను తమ సంపాదనకు అడ్డాగా మార్చుకున్నారు. వసూళ్లకు పాల్పడుతున్న ఈ ఇద్దరూ అసలు పోలీసులే కాదని తెలిసి అవాక్కయ్యారు. వెంటనే వారి అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా పోలీసులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/