యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

huge-rush-throng-at-yadadri-temple

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు కావడం , అలాగే ఈరోజు ఆదివారం కావడం తో ఉదయం నుండే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు నుండి మూడు గంటల సమయం పడుతుండడంతో భక్తులు భారీ క్యూలైన్లలో దర్శనమిస్తున్నారు.

ఆలయ మాడ వీధుల్లో సరిపడా చలువ పందిర్లు లేకపోవడంతో ఎండ వేడికి భక్తులు తట్టుకోలేక బయటే సేదతీరుతున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో హాజరై స్వామి వారికీ మొక్కులు తీర్చుకున్నారు. కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.43కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.