పోలీసుల తీరుపై తుళ్లూరు మహిళల భారీ ర్యాలీ

అమరావతి: ఏపి పోలీసుల తీరును నిరసిస్తూ… శనివారం తుళ్లూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా… అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం ఆగదని మహిళలు, రైతులు హెచ్చరించారు. రైతులు, రైతు కూలీలు, మహిళలపై పోలీసులు దౌర్జన్యం చేయటంతో పాటు, అక్రమ కేసులు బనాయించారని, ఈ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. అమరావతిలోని 29 గ్రామాల్లో జెఎసి నేతలు శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో… విద్య, వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/