సాగర్‌కు కొనసాగుతున్న వరద నీరు

Nagarjunasagar
Nagarjunasagar

నల్గొం: నాగార్జున సాగర్ కు భారీ వరదనీరు కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 26 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 8,14,779 క్యూసెక్కులు ఉండగా , ఔట్ ఫ్లో 8,14, 779 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 584 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 312 టిఎంసిలు, ప్రస్తుతం 304 టిఎంసిలుగా ఉంది.
అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లు 37 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 7,23,936 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 8,57,095 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటి మట్టం 881.30 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు పూర్తి సామర్థం 215 టిఎంసిలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 195.21 క్యూసెక్కులుగా ఉంది. కుడిగట్టు, ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు జలకల సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి ఎక్కువ అయింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/