‘మాస్టర్‌’పై భారీ అంచనాలు

విజయ్ సినిమా పై పెరిగిన క్రేజ్‌

Actor Vijay
Actor Vijay

‘బిగిల్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత విజయ్ నుంచి వస్తున్న ‘మాస్టర్‌’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

ఖైదీతో సూపర్‌హిట్‌ అందుకున్న లోకేష్‌ కనకరాజ్‌ ఈచిత్రానికి దర్శకుడు కావటంతో మరింత క్రేజ్‌ ఏర్పడింది.. విజయ్ సేతుపతి ఈ మూవీలో విలన్‌గా చేయటం మరో విశేషం..

దీంతో ఈ మూవీ విజ§్‌ు గత చిత్రాలకంటే రికార్డుల బద్దలుకొట్టటం ఖాయమని అభిమానులు అంటున్నారు.. ఈచిత్రంలో విజయ్ పాత్ర రెండు నేపథ్యాల్లో ఉంటుందని అంటున్నారు.

ఒక పాత్రలో మాఫియా లీడర్‌గా ఆయన కన్పించనుండగా, మరో పాత్రలో కాలేజ్‌ ప్రొఫెసర్‌గా కన్పిస్తారట.. అయితే మాఫియా లీడర్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ ఎలా అయ్యాడు అనేదే, సినిమాలో అసలు కథ అని అంటున్నారు.

విజయ్ సేతుపతి, విజ§్‌ుల మధ్య ఆధిపత్యపోరు సినిమాకు హైలెట్‌గా సాగుతుందని తెలిసింది.. ఈచిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/