మహీంద్రా వాహనాలపై భారీ ఆఫర్లు

న్యూఢిల్లీ : మహీంద్రా ప్రీమియం ఎస్ యువి ఆల్టురస్ జి4పై రూ.4లక్షల విలువైన ఆఫర్లను అందిస్తోన్నట్లు ఆ కంపెనీ పేర్కొంది. మహీంద్రా మారజోపై కూడా దాదాపు రూ.1.71లక్షల రాయితీ కల్పిస్తోంది. ఎక్స్యు వి 500పై రూ.84వేలు వరకు, టియువి 300 పై రూ.75వేలు, ఎక్స్యువి 300పై రూ.70 వేలు, స్కార్పియోపై రూ.60వేలు, బొలేరోపై రూ.47వేల వరకు డిస్కౌంట్ అందిస్తోన్నట్లు వెల్లడించింది. ఈ తగ్గింపు డిసెంబర్ 31వరకు మాత్రమే వర్తిస్తాయని ఆ కంపెనీ పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/