బ్యాగుల బరువు కేజీన్నర నుంచి ఐదు కేజీలుండాలి..

school bags weight
school bags weight

న్యూఢిల్లీ: చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశాగా కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ కింద పని చేసే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషణ్‌ అండ్‌ లిటరసీ. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బోధన, స్కూలు బ్యాగుల బరువుపై మార్గదర్శకాలు జారీ చేసింది. అదనపు పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ తీసుకురావల్సిందిగా పిల్లలపై ఒత్తిడి తేవొద్దని , స్కూలు బ్యాగుల పరిమితి కూడా తమ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఆ తరగతుల తగ్గట్టు వారి బ్యాగుల భారం ఉండాలని కనిష్టంగా కేజీన్నర నుంచి ఐదు కేజీలు ఉండాలని స్పష్టం చేసింది. ఒకటి, రెండు తరగతులకు అసలు హోమ్‌వర్క్‌ ఉండకూడదని కూడా స్పష్టం చేసింది. డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా విద్యార్ధులపై పుస్తకాల భారాన్ని తగ్గించాలని మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌ అన్నారు.ఇక ప్రతి పాఠశాలలో ఎన్సీఈఆర్టీ పుస్తకాలను కూడా తప్పనిసరి చేయాలని ఈ తాజా సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.