హెచ్‌పీ చేతికి క్రే ఐఎన్‌సీ

HP Enterprise
HP Enterprise

ముంబయి: అమెరికాకు చెందిన సూపర్‌ కంప్యూటర్ల తయారీదారు క్రే ఐఎన్‌సీని హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ కొనుగోలు చేయనుంది. హైఎండ్‌ కంప్యూటింగ్‌లో పోటీని ఎదుర్కొనేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని హెచ్‌పీ భావిస్తోంది.ఈ డీల్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.9,848 కోట్లు. ఈ డీల్‌ కింద ఒక్కో షేరుకు 35డాలర్లు (రూ.2,462) చెల్లిస్తోంది. గురువారం షేరు ధర ముగింపు కంటే ఇది 17 ఎక్కువ. అయితే హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత ఇదే అతిపెద్ద డీల్‌ కావడం విశేషం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/