రోజ్‌వాటర్‌తో ఉపయోగాలెన్నో…

Rose Water

గులాబీ నీటిని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఎండలో తిరగడం వల్ల ముఖం ఎర్రగా కందిపోతుంది.

అలాంటప్పుడు గులాబీ నీటిలో కాస్త కీరదోస రసం కలిపి రాసి పావుగంట తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. గులాబీ నీటిలో కాస్త తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత చన్నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.

చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం పొడిబారినపుడు జీవం కోల్పోనట్లుగా ఉంటుంది. దానికి గులాబీ నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ముఖమంతా పట్టించి, బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

గులాబీ నీటిలో ఉండే యాంటీ బ్యాక్టిరియల్‌ గుణాల వల్ల గాయాల కారణంగా ఏర్పడిన మచ్చలు క్రమంగా తగ్గుతాయి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణజాలాన్ని బలోపేతం చేస్తాయి.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/