పిల్లల అల్లరి ఆపాలంటే..

చిన్నారుల ఆలనా-పాలనా

A child's mischief
A child’s mischief

పిల్లలు ఏడుపు ప్రారంభించగానే ఏడుపు ఆపేందుకు వారు అడిగింది ఇచ్చేస్తాం. అలాగే వారు ఏం అడిగినా కొనిస్తాం. అడిగిందల్లా ఇస్తారని కదా పిల్లలు కొన్ని సార్లు మరింత మొండిగా చేస్తుంటారు.

కొనిచ్చే పరిస్థితులు లేకపోయినా కావాలని మారాం చేస్తుంటారు. అందుకే వారు అడిగిందల్లా కొనిపెట్టడం కాకుండా ముందుగా ఆ వస్తువు గురించి వారికి వివరించాలి. తప్పని సరయితే కొనివ్వాలి. అది ఎలా వాడతారో చూడాలి.

బొమ్మలయితే వారు అల్లరి మాని ఆడుకునేందుకు పనికొస్తాయి. అదే తినే పదార్థాలయితే వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి.

ముందుగా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి. అలా కూడా వినకపోతే వారిని ఏదైనా పని చెప్పి అది పూర్తి చేస్తేనే కొనిస్తాను అని షరతు పెట్టాలి.

వాళ్లు అందుకోసం తప్పనిసరంగా చేస్తారు. లేదా అలా అడగడం మానేస్తారు. ఒకవేళ మీరు చెప్పిన పని చేస్తే అవసరం అనుకుంటేనే కొనివ్వాలి.

అదేవిధంగా చదువు విషయంలో కూడా ఇలాగే చేయాలి. ఏదైనా కోరుకుంటే ముందుగా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించాలి.

ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగి ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేలా తయారవుతారు.

తాజా సినిమా వార్తల కోసం:https://www.vaartha.com/news/movies/