చర్మం మెరుపు కోసం..

అందమే ఆనందం

For skin radiance
For skin radiance


తేనెతో పొందే ఆరోగ్య ఫలతాలు ఎన్నో.ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి కూడా తేనె పనికొస్తుంది. పలు సౌందర్య ఉత్పత్తుల్లో సైతం తేనెతో సౌందర్యాన్ని ఎలా కాపాడుకోవచ్చంటే..

తేనె చర్మంకి తగినంత తేమనందిస్తుంది. కొద్దిగా తేనెను అరచేతుల్లో తీసుకుని, మసాజ్‌ చేస్తున్నట్టుగా ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాలు అలాగే ఉంచాలి. ముఖానికి తేనెను పట్టించే ముందు టవల్‌తో తుడుచుకోవాలి. కాసేపయ్యాక చర్మంపై ఉన్న మురికిపోయి మెరుస్తుంది.

తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేస్తాయి. గాయమైన భాగంలో తేనెను రాసి మర్దన చేసి రెండు నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.

Natural Benefits of Honey for Skin

తేనెలో యాంటీ సెప్టిక్‌ గుణాలు ఉంటాయి. చర్మం దెబ్బతిన్న ప్రాంతంలో తేనె రాసి రెండు నిమిషాల తర్వాత నీటితో కడిగేస్తే సాంత్వన లభిస్తుంది.

తేనె యాక్నేను తగ్గిస్తుంది. యాక్నే ఉన్న చోట తేనెను
అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి.

తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. తేనెలోని హైడ్రేటింగ్‌ గుణాల వల్ల చర్మం సిల్కీగా తయారవుతుంది. ఒక కప్పు వేడి నీళ్లల్లో రెండు టేబుల్‌ స్పూన్ల తేనె వేసి కరగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని బక్కెట్లో ఉన్న వేడి నీళ్లలో కలిపి, ఆ నీటితో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది.

వేళ్ల కొసలు బలంగా, మృదువుగా ఉండటానికి తేనె బాగా పనిచేస్తుంది. కాలి, వేలి కొసల మీద తేనె రాసి పది నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/