ఉమాంగ్‌ యాప్‌తో ఆధార్‌ లింక్‌ !

UMANG app
UMANG app

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ అకౌంట్‌ ఉన్నవాళ్లంతా తమ యుఎఎస్‌నంబర్‌తో ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేయాలి. ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌లో కూడా యుఎఎస్‌-ఆధార్‌ నంబర్లను లింక్‌చేసే అవకాశం కల్పించింది ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ ఇపిఎఫ్‌ఒ. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్‌ యాప్‌ ఉంటే చాలు కేవలం ఐదు స్టెప్స్‌లో యుఎఎస్‌ అకౌంట్‌కు ఆధార్‌ లింక్‌ చేయొచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. ప్లేస్టోర్‌, యాప్‌స్టోర్‌లో ఉమాంగ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఉమాంగ్‌ యాప్‌ ఓపెన్‌చేస్తే అనేక సేవలు కనిపిస్తాయి. అందులో ఇపిఎఫ్‌ఒ లింక్‌పైన క్లిక్‌చేయాలి. ఇకెవైసి సర్వీసెస్‌ ఆప్షన్‌ క్లిక్‌చేయండి. మీరు ఆధార్‌ సీడింగ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌పై క్లిక్‌చేయాలి. మీ యుఎఎన్‌ నంబర్‌ ఎంటర్‌ చేస్తే మీ యుఎఎస్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒటిపి వస్తుంది. ఒటిపితోపాటు వివరాలు ఎంటర్‌ చేస్తే మీ ఆధార్‌, యుఎఎస్‌ నంబర్‌ లింక్‌ అవుతుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/