ఆటోమేషన్‌ యుగంలో జాబ్‌ పొందటం ఎలా?

job in the era of automation

ఏదైనా ఒక ఉద్యోగంలో చేరాలంటే ముందుగా అప్లై చేస్తాం. తర్వాత కాల్‌లెటర్‌ వస్తే, రిటన్‌టెస్ట్‌కు హాజరవ్ఞతాం. అనంతరం నేరుగా ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్‌ అయితే వెంటనే కాల్‌ లెటర్‌ వస్తుంది. ఇవన్నీ మనుషులే చేస్తున్నారనుకుంటే పొరపాటు పడినట్లే, ఆ పనులన్నింటికీ కొన్ని ప్రసిద్ద సంస్థల్లో ఇపుడు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ చేసేస్తోంది. రెజ్యూమెల స్కానింగ్‌, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్‌లను దాటి ఏకంగా మౌకిక పరీక్షలూ నిర్వహించేస్తోంది.

వీటిలో విజయం సాధించాలంటే ఈ ఆటోమేషన్‌ యుగానికి అనుగుణంగా అభ్యర్ధులు సిద్ధం కావాలి. ఖాళీలు పదుల్లో, దరఖాస్తులు వందల్లో, నియామకాలు నెలల్లో, ఇప్పటిదాకా పరిస్థితి ఇది. ఇక ముందు ఇలా ఉండబోదు. ఎన్ని పోస్టులు ఉన్నా, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నా, రోజుల్లోనే ఖాళలీల భర్తీ ఖాయం. రోబోయే రిక్రూట్‌మెంట్‌ ఆఫీసర్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ సాయంతో, ఆటోమేషన్‌తో సంస్థలు నాణ్యమైన సిబ్బంది నియామక ప్రక్రియలను వేగంగా పూర్తి చేస్తున్నాయి. వార్త్తపత్రికలు, వెబ్‌సైట్లలో ప్రకటనలు, సోషల్‌ మీడియాలో సమా చార సేకరణ, ఇలా ఉద్యోగుల ఎంపికలో సంస్థలు ఎన్నో పద్ధతులను పాటిస్తున్నాయి.

ఇప్పుడు ట్రెండ్‌ మారుతోంది. టెక్నాలజీ సాయంతో ఎంపిక ప్రక్రియల్లో మెరుగైన విధానాలను అను సరిస్తున్నాయి. వేల దరఖాస్తులను వేగంగా పరిష్కరించి సరైన సిబ్బందిని ఎంచుకుంటున్నాయి. ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్ప్‌ -కృ త్రిమ మేధ) ఆధారిత రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియతో కంపెనీలకు సమయం ఆదా అవుతోంది. ఖర్చును తగ్గిస్తోంది.

మెరుగైన మానవ వనరులను ఎంపిక చేయటానికి సాయపడుతోంది.పక్షపాత ధోరణికి ఆస్కారం ఉండదు. సంస్థకు సంబంధించి వ్యక్తిగత డేటాబేస్‌ను ఏర్పరచుకునే వీలుంటుంది. దీంతో అప్పటికి అవసరమైన అభ్య ర్ధులను ఎంచుకోవడంతోపాటు భవిష్యత్తుకి పని కొచ్చేవారి వివరాలనూ అందుబాటులో ఉంచు కోవచ్ఛు ఏఐ అభ్యర్థుల నాణ్యతను కనిపెట్టడంలో కచ్చితత్వాన్ని పాటిస్తుంది.

అభ్యర్థులేం చేయాలి?

నియామకాల్లో ఏఐ వినియోగం పెరుగుతోంది. అభ్యర్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని నైపుణ్యాలను పెంచుకోవాలి. దరఖాస్తు సమయంలో పోస్టుకు తగ్గ పదాలను రెజ్యూమెలో ఉపయోగించిలి. వాటిని జాబ్‌ డిస్క్రప్షన్‌ నుంచి పొందవచ్చు పోస్టుకు అవసరమైన నైపుణ్యాలను పరిశీలించుకుని, దరఖాస్తులో వాటికి స్థానం కల్పించాలి.

పరిమితంగా కాకుండా వాటిని వివరంగా చెప్పగలగాలి. ఉదాహరణకు ‘నాయకత్వ లక్షణాలు అని క్లుప్తంగా వదిలేయకుండా కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్‌లో గ్రూపుకి నాయకత్వం వహించాను, ఫలానా పని సమయం కంటే ముందుగా పూర్తి చేయగలిగాను ఈ తరహాలో రాయాలి. వచ్చిన లేదా అదనపు అంధాలన్నీ చేర్చకుండా, వేటిలో నిష్ణాతులో వాటికే స్థానం కల్పించాలి. విషయం ఏదైనా స్పష్టంగా తెలియజేయాలి. స్పెల్లింగుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఇందు కు అవ సరమైతే ఆన్‌లైన్‌ టూల్స్‌ సాయాన్నీ తీసుకో వచ్చు

రెజ్యూమ్‌లో పొందుపరిచిన ప్రతి విష యంపై అభ్యర్ధికి అవగాహన ఉండితీరాలి. వీటిల్లో ఎక్కువ శాతం అభ్యర్థి రాసిన కంటెంట్‌/మాట్లాడినఅంశాన్ని ఏఐ పరిశీలిస్తుంది. అవదుకే చెప్పాలనుకున్న అంశాన్ని వర్ణనాత్మకం గా కాకుండా సూటిగా చెప్పాలి.

ఉదిహరణకు- కస్టమర్‌ నుంచి ఫీడ్‌బ్యాక్‌

ఎంపిక విధానం: ఈ ఏడాది మార్కెటింగ్‌ డేటానుకస్టమర్లకు ఎలా వివరిస్తారు? లేదా పరి శ్రమకు సంబంధించి నచ్చిన ఏదైనాఅంశం, అం దుకు కారణాలు,ఇలా వేటినైనా అడగవచ్చు ఇం దుకోసం పరిశ్రమ, సంస్థల గురించి అవగా హన పెంచుకోవాలి. ఒక సంస్థ ప్రొడక్ట్‌, మార్కె ట్‌, కస్టమర్లు, ఫీడ్‌బ్యాక్‌, తదితర రియల్‌టైం వర్క్‌కు సంబంధించిన అంశాల గురించి తెలుసుకోవాలి.

ఇంటర్వ్యూ:

వోకల్‌ టోన్‌కూ, జాబ్‌ డిస్క్రిప్షన్‌ లోని కీవర్డ్‌లకు ప్రాధాన్యమివ్వాలి. ఏం చెబు తున్నారనే దానిపైనే కాకుండా ఎలా చెబుతున్నా రన్న దానిపైనా ఏఐ దృష్టి పెడుతుందని గమనిం చాలి. ఇతర అర్హతలు న్న అభ్యర్ధులతో పోల్చి, దాని ఆధారంగా ర్యాంకు ఇస్తుంది. కాబట్టి, ఆత్మవిశ్వాసం తప్పనిసరి, సాధారణ ఇంటర్వ్యూ లాగానే చిరునవ్వు, శరీర భాషలకు ప్రాధాన్యమి వ్వాలి. అందుకు తగ్గట్టుగా ముందుగానే సాధన చేయాలి. సరైన దుస్తులను దరించడం, చెప్పాల నుకున్న విషయాలకు సంబంధించి ముందుగా సిద్ధయవడం వంటి వాటిపై దృష్టిపెట్టాలి.

కొద్దిపాటి సాధనతో ఇవన్నీ నేర్చుకోవడం సులువే ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు అందుబాటులో ఉన్నాయి. మాక్‌ ఇంటర్వ్యూను వీడియో తీసుకుని, ఎక్కడ మార్పులు చేసుకోవాలో గమనించ వచ్చు ఏ వాక్యాలను ఎక్కువగా ఉపయోగిస్తు న్నారు వంటి వాటిని చెక్‌ చేసుకోవచ్చు తద్వారా సంభాషణ తీరును మెరుగుపచుకోవచ్చు.

కొన్ని ఉద్యోగాలకు సంబంధించి హెచ్‌ఆర్‌ బృందానికి వెయ్యి ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయనుకుంటే వాటిని పరిష్కరించడానికి వ్లాకు సమయం పడుతుందది. నిర్దిష్ట నైపుణ్యాలు, అనుభవం వంటివి అవసరమైతే వచ్చిన ప్రతి రెజ్యూమెలో వాటిని పరిశీలించా డానికి మరిన్ని రోజులు అవసరమవుతాయి. దీనివల్ల కష్టం, టెక్నాలజీ ఎన్నో పద్ధతులను అనుసరిస్తుంది.

సోర్సింగ్‌: ఇంటర్నెట్‌/సంస్థ డేటాబేస్‌ల్లోని రెజ్యూమెలు, ప్రొపైళ్లను ఏఐ కీలక పదాల (కీవర్డ్స్‌) ద్వారా పరీశీలించి సంబంధిత పోస్టుల కు ఎవరు సరైనవారో గ్రహిస్తుంది. వాటి ఆధారంగా ఎంపికైనవారికి ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను నిర్ణయించి,ఆవివరాలను మెయిల్‌ లేదా కాల్‌ రూపం లో అందజేస్తుంది.ఎంపిక కాని వారికీ ఆ విషయాన్ని తెలియజేస్తూ మెయిల్‌ పంపుతుంది. అభ్యర్ధి దరఖాస్తు చేసుకున్న పోస్టుకి కాకుండా వేరే దానికి అర్హులైతే వారితో మాట్లాడి, ఎలా దరఖా స్తుచేసుకోవాలో కొన్ని ఏఐ టూల్స్‌ సూచిస్తాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/