ఫైనాన్స్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెలా?

దోపిడీకి గురవుతున్న మధ్యతరగతి ప్రజానీకం

How to curb financial turmoil?
How to curb financial turmoil?

తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా ఫైనాన్స్‌ వర్గాలు దందాకి పాల్పడుతున్నాయి. పేద,దిగువ మధ్యతరగతి ప్రజా నీకాన్ని దోపిడీ చేస్తూ పీల్చిపిప్పి చేస్తున్నాయి.

ప్రధానంగా హైద రాబాద్‌లో ఫైనాన్స్‌లు విపరీతం గా దోచుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు.ఫైనాన్స్‌కంపెనీలు రాష్ట్రంలో తక్కువ వడ్డీ అంటూ మొదట నమ్మిచ్చి ఉచ్చులోకి లాగుతాయి.

ఆ తర్వాత చెల్లింపులు కట్టని చోట కనీసం నోటీ సులు లేకుండా వాహనాలను సీజ్‌ చేస్తాయి. సీజ్‌ చేసే సమ యంలో లోన్‌తీసుకున్న యజమాని దగ్గరేఆర్సీ,పేపర్స్‌ ఉండి పోతాయి.కానీ కొన్నాళ్లు ఆగాక కన్సల్టెంట్స్‌తోకుమ్మక్కై అమ్ము కునే యత్నాలు నడుస్తాయి. అయితే ఇక్కడ వాహనాలకు యజమాని ఎవరు అవ్ఞతారు. ఫైనాన్స్‌సంస్థనా లేకుంటే లోన్‌ వాహనదారా లోన్‌ తీసుకున్న అతను తీసుకున్న డబ్బులు కట్టకనే వీరుసీజ్‌ చేస్తారు.అప్పుడు యజమాని ఫైనాన్స్‌ సంస్థ అవుతుంది.

కానీ ఇక్కడ భారీమోసాలు జరుగుతున్నాయి. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లుగా వాహనాలు అమ్మి ఎన్‌ఓసి మాత్రమే ఇస్తారు.

మరి ఇక్కడ ఎన్‌ఓసి అర్థం లోన్‌ క్లియరెన్స్‌ లెటర్‌ మాత్రమే. కానీ అసలు యజమాని నుండి అంటే ఫైనాన్స్‌ సంస్థల నుండి కొత్త ఆర్సీ, పేపర్లు ఇవ్వకుండా, యజమాని బదిలీ పేపర్లతో ఫైనాన్స్‌ సంస్థలు సంతకాలు పెట్టకుండా యధేచ్చగా రిజిస్ట్రేషన్‌లు నడుస్తున్నాయి.

వారు మోసపూరితంగా అమ్మేయడం, అంటే అవన్నీ బోగస్‌రిజిస్ట్రేషన్‌లు అని అర్థంచేసుకోవచ్చు. అంటే ఇక్కడ అమ్మేటప్పుడు ఆ లోన్‌ తీసుకున్నవ్యక్తికి ఏ సమాచారం ఉండదు. మరి యజమాన్యం బదిలీ ఎలా అవుతుంది.

ఇక్కడే బ్రోకర్లు రవాణాశాఖ నిర్లక్ష్యం వారిపాలిట కల్పతరువ్ఞ అవ్ఞ తుంది. అంతేకాక అమ్యామ్యాల కోసం కక్కుర్తి, బోగస్‌ పత్రా లతో అంటే లోన్‌ తీసుకున్న యజమాని రాడు.

లోన్‌ ఇచ్చిన ఫైనాన్స్‌సంస్థలు వారికి ఉన్న ప్రత్యేకహక్కులతో యాజమాన్య బదిలీ చేయకుండా కేవలం అమ్ముకుందాం కలిసిపంచుకుందాం అనే ధోరణిలో బాగోతం సాగుతుంది.అంటే బోగస్‌ వ్యక్తులతో కథ నడిపి రిజిస్ట్రేషన్లు కానిచ్చేస్తారు.

ఇక్కడ ఎవరో బోగస్‌ వ్యక్తి వచ్చినప్పుడు ఆధార్‌తో సరిపోల్చకుండా లోన్‌ తీసుకున్న వ్యక్తిమీదికి మొదట వాహన రిజిస్ట్రేషన్‌చేసి ఆ తర్వాత కొత్తగా కొన్న యజమానిమీదకు మార్చేస్తున్నారు.అంటే ఇక్కడఅమ్మింది లోన్‌ తీసుకున్న వ్యక్తి వేర్వేరు.

మరి డబ్బులు చెల్లించింది ఫైనాన్స్‌ సంస్థలకు కదా! అంటే యజమాని ఫైనాన్స్‌ సంస్థ కదా? మరి లోన్‌ తీసుకున్న వ్యక్తి పత్రాలతో లోన్‌ తీసుకున్న వ్యక్తి లేకుండా ఎలా రిజిస్ట్రేషన్‌లు జరుగుతాయని సవాలక్ష సందేహాలు మనకి కలుగుతాయి.

అయితే ఇక్కడ డబ్బులు చెల్లించాక ఎన్‌ఓసి ఇవ్వాల్సింది లోన్‌ వాహన లోన్‌దారునికి. ఇక్కడ లోన్‌ క్లియరెన్స్‌ లెటర్‌ ఇవ్వాల్సింది లోన్‌ దారునికి.

లేదా కొనుగోలుదారునికి అమ్మాల్సివచ్చినప్పుడు ఆయా కంపె నీల నుండి వారికి ఉన్న హక్కులను కొనుగోలుదారునికి బదిలీ చేయాలి. కానీ వాస్తవానికి అలా ఎక్కడా జరగట్లేదు.

కోర్టులో అనుమతికి కోరడం లేదు. పత్రికలలో ప్రకటనలు ఇవ్వరు. ఒకవేళ అమ్ముతున్నారని తెలిసున్నా ఇతరులను యార్డుల్లోకి రానివ్వరు.

రవాణాశాఖలో కీలక ఫార్మ్స్‌ అయిన 29,30, 35,36,37 అనేవి అక్కడ ఉండవ్ఞ. ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరుస్తున్నాయి.

మరి వాహనాలు ఎలా సీజ్‌ చేయాలి. ఎలా యాజమాన్యం బదిలీచేయాలి.వరుసగా ఐదు నెలలపాటు చెల్లింపు చేయకుంటే ముందస్తుతో నోటీస్‌ ఇచ్చి సీజ్‌ చేసి ఆ సమాచారం రవాణాశాఖకు ఇవ్వాల్సింది.

ఆ తరువాత రవాణా శాఖవారు లోన్‌చెల్లింపుచేయని వాహన యజమానులకునోటీస్‌ ఇచ్చి తగిన సమయంలోయాజమాన్య హక్కును ఆ వాహన రుణం ఇచ్చినసంస్థకు బదిలీ చేస్తుంది.

అప్పుడు ఆ వాహనాల ను అమ్మేటప్పుడు ఎన్నో నిబంధనలు పాటించి అమ్మాల్సి ఉంటుంది.కానీ అవేవి ఉండవు.

వాహన రుణసంస్థలు వాళ్లకు ఇష్టం ఉన్న వ్యక్తులకు అమ్మి కేవలం పేపర్లపై మాత్రమే యాక్షన్లు నిర్వహించామని వాళ్లకువాళ్లే రాసేసుకుని అమ్మేసు కుని సొమ్ము చేసుకోవడం,.

ఆ తరువాత తక్కువసొమ్ము వచ్చినట్టు చూపిస్తే ఆ లోన్‌ వాహనదారున్ని దారుణంగా మరింత ముంచినట్లే.ఇదిఎంత దారుణం.ఇది వారి దుర్మార్గానికి పరాకావు..

అంటే ఇంకా చెల్లించాల్సిన బాకీ సొమ్ములను ఆ లోన్‌ వాహనదారుని వ్యక్తి ఆస్తుల నుండి వసూలు చేస్తారు.

తక్కువ వచ్చినట్టు చూపిస్తే లోన్‌దారుని ఆస్తులనుఅమ్మేసే అధికారం ఫైనాన్స్‌ సంస్థలకు ఉంది. మరి ఇంత దారుణాలు జరుగుతున్నా ఏ ఒక్కరూ వారిని అడగరని అమాయక లోన్‌ దారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

ఈ తతంగం అంతా లంచాలమయం. ఈ తెరచాటు దోపిడీ వల్ల ఎంతోమంది పేద ప్రజానీకం, దిగువ మధ్యతరగతి ప్రజానీకం తమ జీవితాంతం చేసిన శ్రమని కోల్పోతున్నారు.

అందుచేత రాష్ట్రప్రభుత్వం ఇప్ప టికైనా స్పందించి దీనిపై ప్రత్యేక చట్టం లేదా నిబంధనలను రూపకల్పనదిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవశ్యకతఉంది.

-మన్నారం నాగరాజు, (రచయిత: రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ లోక్‌సత్తాపార్టీ)

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/