పూజా సామగ్రి మెరిసే ఇలా..

ఇంటింటి చిట్కాలు

Pooja kit
Pooja kit

హిందువులకు పూజా సామాగ్రిని తప్పక వాడుతుంటారు. వారి గృహా లలో వివాహ, యజ్ఞాలు, యాగా లు, సత్యనారాయణ వ్రతం, పండుగలు వంటి ఇతర పూజావేడుకల సమయంలో ఇత్తడి, వెండి, బంగారు, రాగి, పంచలోహాలు వంటి పూజాసామాగ్రిలా వాడుతుంటారు.

తర్వాత వాటిని నిత్యం కొందరు వాడుతుంటారు మరికొందరు పక్కన పెడతారు. కాలం గడిచేకొద్ది ఇవి నల్లబడుతుంటాయి.

వేడుకల సమయంలో వాటిని శుభ్రం చేయాలంటే కష్టమే. ఏదో మీకు తెలిసిన విధానంలో వాటిని శుభ్రం చేస్తే, అవి తమ సహజతత్వాన్ని కోల్పోతాయి.

అయితే పూజ వస్తువులు వాటి సహజతత్వాన్ని కోల్పోకుండా ఉండాలంటే వాటిని శుభ్రపరిచే తీరుకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

బంగారు వస్తువులు: బంగారు వస్తువులను బయటికి తీసిన కాసేపటిలోనే వాటిపై మట్టి చేరుకుంటుంది.

ఇది మన కంటికి కనబడనంత సన్నగా ఉంటుంది. వాడిన తరువాత వాటిని వేడినీళ్లతో వేసి కడగాలి అటు పై కాస్త కోల్గేట్‌ పళ్లపొడిని తీసుకొని వాటికి పట్టించి సన్నని బ్రష్‌ సహాయంతో మురికిని తొలగించి వాటిని వెల్‌వెట్‌క్లాత్‌లో, బాక్స్‌లో గానీ పొందు పరచాలి.

ప్లాస్టిక్‌ డబ్బాలో, షాపులో ఇచ్చే జ్యుయెలరీ బ్లాక్‌లో వీటిని ఉంచకూడదు. వాటిలో రసాయనాలు కలపబడి ఉంటాయి. కాబట్టి బంగారం రంగుమారిపోతుంది.

వెండి:

దీపపు కుందులు ఎక్కువగా వెండివే ఉంటాయి. అందులో నూనెపోయడం వత్తులు వెలిగించడం వల్ల నల్లబడతాయి.

ఆ నలుపు పోవాలంటే ఏదైనా బాత్‌సోప్‌ వాటికి అప్లయి చేసే పదినిమిషాల తరువాత కడిగేయాలి.

వీటి తడి ఆరిన తరువాత గాలి తగిలే చెక్క బాక్సులో అమర్చి ఉంచాలి. వీటిని చల్లని నీటితో శుభ్రపరిస్తే చాలు. వేడినీటిని వీటికి అస్సలు తగలనీయకూడదు.

ప్లాస్టిక్‌ కవర్‌లో అలాగే ఉంచేయవచ్చు.

ఇత్తడి, పంచలోహాలు:

నిమ్మరసం, వెనిగర్‌, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ఇత్తడి వస్తువ్ఞలకు పదినిమిషాలు పట్టించి ఆపై కడిగేస్తే కొత్తమెరుపును సంతరించుకుంటాయి.

లేదా కుక్కింగ్‌ ఆయిల్‌ని పట్టించి కడిగేసినా మంచి మెరుపు వస్తుంది. గాలి చొరబడని ప్రదేశంలో అమర్చాలి. రాగి వీటిని శుభ్రపరచడానికి ఇప్పుడు చాలా పౌడర్‌లు అందుబాటులో ఉన్నాయి.

వేడినీళ్లలో సోప్‌వాటర్‌ వేసి కూడా శుభ్రపరచవచ్చు.

కెచప్‌ని రాసి 5-10 నిమిషాల తరు వాత కడిగితే తిరిగి కొత్తవాటిలా అవుతాయి. గాలి తగలని చోట ఉండాలి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/